ETV Bharat / state

స్వచ్ఛ సర్వేక్షన్​పై మేయర్ సమీక్ష - మౌలిక వసతులు

నగరంలోని అన్ని డివిజన్లలో కనీస మౌలిక వసతులను కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్నామని కరీంనగర్ మేయర్ సునీల్​రావు పేర్కొన్నారు.​ నగరంలో పారిశుధ్య నిర్వాహణపై నగర కమిషనర్ వల్లూరు క్రాంతి, సిబ్బందితో కలిసి ఆయన సమీక్షించారు.

Mayor's review on sanitation management in karimanagar city
స్వచ్ఛ సర్వేక్షన్​పై మేయర్ సమీక్ష
author img

By

Published : Jan 21, 2021, 11:57 AM IST

డివిజన్ల వారీగా ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని కరీంనగర్ మేయర్ సునీల్​రావు.. అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షన్​పై నగర కమిషనర్ వల్లూరు క్రాంతి, పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ఆయన సమీక్షించారు. అన్ని డివిజన్లలో కనీస మౌలిక వసతులను కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్నామని ఆయన​ పేర్కొన్నారు.

అనంతరం 14వ డివిజన్లో రూ. 21లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు.. కార్పొరేటర్ మహేశ్​తో కలిసి సునీల్​రావు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే డివిజన్లో 30లక్షలతో పార్క్ అభివృద్ధికి చర్యలు చేపట్టామని గుర్తుచేశారు.

ఇదీ చదవండి: ప్రేమ.. పెళ్లి.. కౌన్సెలింగ్.. లొల్లి.. హత్య.. ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.