మరికొద్ది నెలల్లో విడిపోవాలనుకున్నారు ఆ జంట. ఇద్దరూ దూరంగా ఉంటున్నవేళ అనూహ్యంగా ప్రాదేశిక ఎన్నికలు వచ్చాయి. అంతే... ఇద్దరూ కలిసిపోయారు. ఎంపీటీసీగా భార్య పోటీ చేసి గెలిస్తే... ఎంపీపీ బోనస్‌గా దక్కింది.
భార్యాభర్తలు ఒక్కటయ్యారు.. పదవి కొట్టారు కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీపీగా కలిగేటి కవిత ఎన్నికయ్యారు. కొరాటపల్లి గ్రామానికి చెందిన కలిగేటి లక్ష్మణ్, కవితలు గత ఐదేళ్లుగా మనస్పర్థలతో దూరంగా ఉంటున్నారు. చివరికి విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. అదే సమయంలో వచ్చిన ప్రాదేశిక ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని తెరాస పార్టీకి చెందిన కలిగేటి లక్ష్మణ్ అధిష్ఠానాన్ని కోరారు. కానీ భార్యాభర్తలు కలిసి వస్తేనే టికెట్ ఇస్తామని తెరాస నాయకులు స్పష్టం చేయడం వల్ల రాజీ కుదుర్చుకొని కలిగేటి కవితను తీసుకువచ్చారు. మోతే ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం అదృష్టం కలిసి వచ్చి రామడుగు ఎంపీపీగా కలిగేటి కవిత ఎన్నికయ్యారు. ఇలా అదృష్టం రెండుసార్లు తలుపు తట్టడం వల్ల ఆ జంట ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు.
ఇవీ చూడండి: నాగర్‌కర్నూల్ జిల్లా తెరాసలో వర్గపోరు... ఘర్షణ