ETV Bharat / state

'వారి సేవలను గుర్తించి పూర్తి వేతనమివ్వండి' - carona virus

కాంగ్రెస్​ సీనియర్​ నేత, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ముఖ్యమంత్రికి ప్రత్యేక లేఖ రాశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించడం సరికాదన్నారు. విద్యుత్ ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు పూర్తి వేతనం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

jeevan reddy letter
ముఖ్యమంత్రికి జీవన్​రెడ్డి లేఖ
author img

By

Published : Apr 12, 2020, 5:12 PM IST

విద్యుత్ ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు పూర్తి వేతనం అందించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను లేఖ రాశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సేవలు మరవలేనివన్నారు. లాక్​డౌన్‌ సందర్భంగా ప్రజలు ఇళ్లకే పరిమతమైన తరుణంలో విద్యుత్తు సరఫరాలో ఆటంకం కలగకుండా ఉద్యోగులు, సిబ్బంది పని చేస్తున్నారని పేర్కొన్నారు.

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కార్మికులు కూడా నిరంతరం పనిచేస్తున్నారు కాబట్టే.. విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు లేవన్నారు. వారి సేవలను గుర్తించి ఈ నెల పూర్తి వేతనం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ని కోరారు. వేతనాల్లో 50 శాతం కోత విధించడంపై ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారని జీవన్​రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

jeevan reddy letter
ముఖ్యమంత్రికి జీవన్​రెడ్డి లేఖ

ఇవీ చూడండి: కుమారుడి అంత్యక్రియలకు 2,000 కి.మీ ప్రయాణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.