ETV Bharat / state

కరోనా బాధితుల కోసం జమాతే ఇస్లామీ హింద్​ ప్రత్యేక హెల్ప్​లైన్​

author img

By

Published : Aug 7, 2020, 8:11 AM IST

కరోనా బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల కోసం జమాతే ఇస్లామీ హింద్​ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్​లైన్​ ఏర్పాటు చేశారు. కొవిడ్​ లక్షణాలు కనిపించిన అనుమానితులు వెంటనే హెల్ప్​లైన్​ను సంప్రదించాలని సూచించారు.

Jamaat-e-Islami Hind Special Helpline for Corona Victims
కరోనా బాధితుల కోసం జమాతే ఇస్లామీ హింద్​ ప్రత్యేక హెల్ప్​లైన్​

కరీంనగర్​లో కరోనా వైరస్​ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోన్న తరుణంలో బాధితులకు అండగా ఉండేందుకు జమాతే ఇస్లామీ హింద్‌ ప్రత్యేక హెల్ప్‌లైన్​ను ప్రారంభించింది. కుల, మతాలకు అతీతంగా.. 25 మంది వైద్యుల బృందం ఆధ్వర్యంలో 24 గంటల పాటు సేవలు అందించనున్నట్లు తెలిపారు.

కరోనా బాధితులకు సేవలందించేందుకు కుటుంబసభ్యులు సైతం ముందుకు రావడం లేదని.. ఫలితంగా బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని జమాతే ఇస్లామీ హింద్‌ అధ్యక్షులు ఖైరుద్దీన్ పేర్కొన్నారు. కొవిడ్ లక్షణాలు కనిపించగానే బాధితులు హెల్ప్‌‌లైన్‌కు ఫోన్‌ చేయాలని ఆయన సూచించారు. అవసరమైతే సూచనలు, అత్యవసరమైతే ఆక్సిజన్ సహాయం కూడా అందించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

అంతిమ సంస్కారాలు సైతం..

కరోనాతో చనిపోయిన వారికి మతాచారాలకు అనుగుణంగా అంతిమ సంస్కారాలు చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటారని.. బాధితులు 8309511198, 9849163996, 9100651312, 9985017155, 9849714527 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. కొవిడ్​ బారినపడిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇవీ చూడండి: మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌కు బెదిరింపు కాల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.