ETV Bharat / state

Huzurabad by election 2021: ప్రశాంతంగా కొనసాగుతున్న హూజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌.. - తెలంగాణ వార్తలు

ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్(Huzurabad by election 2021) కొనసాగుతోంది. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఉపఎన్నికల ఫలితాలు నవంబర్‌ 2న వెల్లడి కానున్నాయి.

Huzurabad by election 2021, huzurabad by poll
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం, హుజూరాబాద్ బైపోల్ వార్తలు
author img

By

Published : Oct 30, 2021, 7:53 AM IST

Updated : Oct 30, 2021, 9:12 AM IST

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది(Huzurabad by election 2021). ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌..... సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. వీణవంకలో ఓటర్లు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పోలింగ్‌ సెంటర్‌ వద్దకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. కరోనా జాగ్రత్తలతో పోలింగ్‌(Huzurabad by election 2021) జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు నవంబర్ 2న జరగనుంది.

తెలుగు రాష్ట్రాల్లోనే హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. భాజపా తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, తెరాస నుంచి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నుంచి బల్మూరి వెంకట్‌ బరిలో ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్‌ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

కరోనా నిబంధనల నడుమ పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని వసతులు కల్పించారు. హెల్త్ క్యాంప్​ను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: NGT on Palamuru Rangareddy Project: 'పాలమూరు-రంగారెడ్డి'కి ఎన్జీటీ బ్రేక్​... అనుమతులొచ్చేదాకా ముందుకెళ్లొద్దని ఆదేశం

Last Updated : Oct 30, 2021, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.