ETV Bharat / state

అనాథలైన చిన్నారులు.. ఆదుకున్న మంచి మనుషులు! - అనాథలైన చిన్నారులు

ఆరు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలైన ఇద్దరు చిన్నారుల గురించి ఈటీవీ భారత్​, ఈటీవీ తెలంగాణలో వచ్చిన కథనాలకు అధికారులు, మానవతావాదులు స్పందించారు. ఆ చిన్నారుల బాధ్యత తీసుకొని వారిని చదివిస్తామని, వారికి అండగా ఉంటామని ముందుకొచ్చారు.

Humanists Helps Two Children's Who Loss Their Parents
అనాథలైన చిన్నారులు.. ఆదుకున్న మంచి మనుషులు!
author img

By

Published : Aug 20, 2020, 9:07 PM IST

కరీంనగర్​ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని ఎరవండి గ్రామంలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల గురించి ఈటీవీ భారత్​, ఈటీవీ తెలంగాణలో వచ్చిన కథనాలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, మానవతావాదులు స్పందించారు. ఆరు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలైన అభినయ, ఆలయ అనే ఇద్దరు చిన్నారుల బాధ్యతను తీసుకోవడానికి పలువురు ముందుకొచ్చారు.

ఈటీవీ ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్​ శశాంక వెంటనే హుజూరాబాద్​ ఆర్డీవో బెన్​షోలెంను చిన్నారుల ఇంటికి వెళ్లి పరామర్శించాలని, వారికి అవసరమైన సాయం చేసి వారికి అండగా ఉండాలని ఆదేశించారు. ఎమ్మెల్యే సుంకె రవి తన వంతు ఆర్థికసాయం చేయడమే కాకుండా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​, పలు ప్రజాసంఘాలతో కలిసి చిన్నారుల కోసం విరాళాలు సేకరించి ఇస్తానని హామీ ఇచ్చారు. హుజూరాబాద్​ సీఐ కిరణ్​ తనవంతు సాయంగా రూ.5వేల నగదు, క్వింటాల్​ బియ్యం అందజేశారు. అభినయ, ఆలయలను హాస్టల్లో చేర్పించి వారి చదువుకు అయ్యే ఖర్చులన్నీ భరిస్తామని కరీంనగర్​ లయన్స్​ క్లబ్​ ప్రకటించింది. ఆ బాలికలకు మీ వంతుగా ఆర్థిక సహాయం చేయాలనుకునేవారు.. 9989222027 నెంబరుకు గూగుల్​ పే, ఫోన్​ పే ద్వారా చేయవచ్చు.

ఇవీచూడండి: మానవత్వం చాటుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.