ETV Bharat / state

Rajiv swagruha plots auction: ప్రభుత్వానికి కాసుల పంట.. ప్లాట్ల వేలానికి విశేష స్పందన

Rajiv swagruha auction: రాజీవ్‌ స్వగృహ వేలానికి కరీంనగర్‌ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. పేద, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేరకపోయినా సర్కార్‌ జానా కాసులతో కళకళలాడే పరిస్థితి నెలకొంది. ఊహించని రీతిలో ప్లాట్లను సొంతం చేసుకునేందుకు రెట్టింపు ధర చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆమోదం, బ్యాంకుల నుంచి రుణ సదుపాయం, న్యాయపరమైన చిక్కులు ఉండవనే ఉద్దేశంతో ప్లాట్లకు పోటీ పడుతున్నారు.

author img

By

Published : Jun 23, 2022, 5:46 PM IST

Rajiv swagruha auction
రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల వేలానికి విశేష స్పందన

Rajiv swagruha auction: కరీంనగర్‌ జిల్లా నుస్తులాపూర్ అంగారక టౌన్‌షిప్‌లో ఫ్లాట్లను వేలం వేసే ప్రక్రియ సాగుతుండగానే... మరోవైపు ఆందోళన సాగుతోంది. హైదరాబాద్‍ జాతీయ రహదారికి కూతవేటు దూరంలోనే అభివృద్ధి చేసిన లే-ఔట్‌లో 237 ప్లాట్లను తొలి దశలో వేలం వేయనున్నట్లు ప్రకటించారు. నివాసానికైతే చదరపు గజానికి ఆరువేలు, వాణిజ్య ప్లాటైతే 8వేలుగా నిర్ణయించారు. రాజీవ్‌ స్వగృహ దరఖాస్తుదారుల ధరావత్‌ నుంచి మినహాయించిన అధికారులు... కొత్తగా వేలంలో పాల్గొనదలిచే వారు 10వేలు డిపాజిట్‌ చెల్లించాలని నింబంధన పెట్టారు. రాజీవ్ స్వగృహ దరఖాస్తుదారులు మాత్రం ఆ ప్లాట్లు తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ఇళ్ల కోసం తాము చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని వాపోతున్నారు.

ప్రభుత్వానికి కాసుల పంట.. ప్లాట్ల వేలానికి విశేష స్పందన

రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి ప్రజల నుంచి విశేష ఆదరణ వచ్చింది. వాణిజ్య ప్లాట్లకు కనిష్ఠంగా 12వేలు, గరిష్ఠంగా 22 వేలు పలకడంతో అధికారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మొదటి ప్లాటు ధరను అధికారులు 83 లక్షలుగా నిర్ణయించగా కోటి35వేలకుపైగా చెల్లించి దరఖాస్తుదారుడు సొంతం చేసుకున్నారు. తొలి రోజు 11 వాణిజ్య ప్లాట్ల ద్వారా ఎనిమిదిన్నర కోట్లు సర్కార్‌ ఖజానాకు చేరింది. నివాస ప్లాట్లు గరిష్ఠంగా 18 వేల 600వరకు పలికింది. 42వ ప్లాట్‌కు ప్రభుత్వం ధర 12లక్షలు ఖరారు చేయగా 37లక్షలకు పాడి ఓ స్థిరాస్తి వ్యాపారి సొంతం చేసుకున్నారు. వేలంలో స్థిరాస్థి వ్యాపారులు పాల్గొనడం వల్ల ధరలు అమాంతం పెరిగి ప్రభుత్వానికి కాసులు కురిపిస్తోంది.

ఇవీ చదవండి:

ఊపందుకున్న వరంగల్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు.. అనుకున్న సమయానికే..!

జీవచ్ఛవంలా చిన్నారి.. దేవుడి​పైనే ఆశలు.. ఈటీవీ భారత్​ కథనంతో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.