కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామంలో సంగం లక్ష్మీ (75) జీవనం సాగిస్తుంది. లక్ష్మీ భర్త రెండేళ్ల క్రితం మరణించాడు. కన్న పిల్లలు లేక.. వ్యవసాయం చేసుకునేందుకు భూమి లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంది.
ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్న మంజూరు కాలేదు. బతుకు భారమైన.. జీవనం సాగిస్తున్న ఆ వృద్ధురాలి ఘటనపై హెచ్‌ఆర్సీ స్పందించింది. ఈ విషయంపై విచారణ జరిపి.. నవంబర్ 13లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంకకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: కాలుష్య కారక పరిశ్రమలపై హెచ్‌ఆర్సీ సీరియస్.. సుమోటోగా కేసు స్వీకరణ