ETV Bharat / state

కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ... లక్ష్యం సాకారమయ్యేనా..!! - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు

karimnagar smart city: కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ! ఈ లక్ష్యం ఇప్పట్లో సాకారమయ్యేలా కనిపించడంలేదు. నగర రూపురేఖలు మార్చేలా మూడేళ్ల కిందట ప్రారంభించిన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పాత 50 డివిజన్లలో 31డివిజన్లు ఎంపిక చేసిన అధికారులు మొదటి ప్రాధాన్యం కింద తీసుకున్న పనుల్లో ఒకటి రెండు మాత్రమే పూర్తిచేయగా మిగతావి మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పనులు
కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పనులు
author img

By

Published : May 25, 2022, 9:50 AM IST

karimnagar smart city: మహా నగరాల తరహాలో సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కరీంనగర్​ను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేశారు. పనులు ప్రారంభమై మూడేళ్లు గడుస్తోన్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. తొలి ప్రాధాన్యంగా రహదారులు, డ్రైనేజీలు, సైకిల్‌, వాకింగ్‌ట్రాక్‌, మొక్కల పెంపకం, పార్కులు, కూడళ్ల సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. వీటిలో ఒకటిరెండు పూర్తి కాగా మిగతావి చిన్నచిన్న కారణాలతో నిలిచిపోయాయి.

ఆకర్షణీయ నగరం పనులు చేపట్టేందుకు ఏజెన్సీలకు పలుమార్లు గడువు విధించినా.. ప్రతి ఆరు నెలలకొకసారి పొడిగించేందుకే అధికారులు మొగ్గు చూపుతున్నారు. నగరపాలక ఇంజినీర్లు పనులు పూర్తి చేసేలా పర్యవేక్షించడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. నగరంలో 34కిమీ పొడువునా 84 పైగా రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇందులో ఏ ఒక్కటీ కూడా పూర్తికాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

సుమారు 30 అడుగుల నుంచి 60అడుగుల వరకు రహదారులు విస్తరించాలని పనులు ప్రారంభించారు. ఆ పనులు పూర్తికాక పోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంబేడ్కర్‌స్టేడియంలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పనులకు 22కోట్లు కేటాయించగా 80శాతం పనులు జరిగాయి. టవర్‌ సర్కిల్ అభివృద్దికి17కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు 36శాతమే పూర్తయింది.

విద్యానగర్‌లో రెండు చోట్ల డ్రైనేజీ నిర్మాణ పనులు నిలిచిపోగా.. ప్రభుత్వాసుపత్రి వెనుక మురుగు కాల్వల పనులు చేయకుండా వదిలేశారు. మంకమ్మతోటలోని ఎస్టీ కాలనీ వైపు అప్రోచ్‌ రహదారి నిర్మించకుండా అలాగే వదిలేశారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల రోడ్డు రెండు వైపులా విద్యుత్తు స్తంభాలు, నియంత్రికలు అడ్డుగా ఉండటంతో పనులు నిలిచిపోయాయి. అనేక చోట్ల పనులు నిలిచిపోగా తాము ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

"పనులు ప్రారంభిస్తున్నారు కానీ మధ్యలోనే ఆపేస్తున్నారు. చాలా చోట్ల చెత్త కుండీలు, పుట్​పాత్​లు, రోడ్ల పనులన్ని అసంపూర్తిగానే ఉన్నాయి. వర్షాకాలం వచ్చే లోపే పనులు పూర్తి చేయాలి." -కాసర్ల ఆనంద్​ కుమార్ కార్పొరేటర్

ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్న చందంగా కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పనులు

ఇదీ చదవండి: భూ సమస్యలపై రెవెన్యూశాఖ దో‘భూ’చులాట..!

బ్రిటన్ నేతను కలిసిన రాహుల్.. దేశంలో రాజకీయ దుమారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.