Gulf Agents Frauds Telangana : స్వదేశంలో ఉపాధి కరవై అప్పులు చేసి ఎడారి దేశాల బాట పట్టిన వలస జీవుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ప్రధానంగా నకిలీ ఏజెంట్లు ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలని భావిస్తున్న వారిని నిలువునా ముంచుతున్నారు. వీరిని నమ్మి లక్షలు ఖర్చు చేస్తోన్న బాధితులు.. కొద్దిరోజులకు మోసాన్ని గ్రహించి లబోదిబోంటున్నారు. రాష్ట్రంలో ఎక్కువగా కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల వారు ఉపాధి కోసం గల్ఫ్ దేశాల బాటపడుతుంటారు. దీనిని అదునుగా భావించి నకిలీ ఏజెంట్లు పెద్దఎత్తున పుట్టుకొస్తున్నారు. లైసెన్స్లేకున్నా అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ మోసాలకు తెగబడుతున్నారు. జగిత్యాలలో గల్ఫ్ దేశాలకు పంపిస్తానని.. పలువురి నుంచి రూ.9 కోట్లు వసూలు చేసిన ఓ ఏజెంట్ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Fake Agent Fraud to Youth Offer Jobs : యూరప్ పంపిస్తానని ఓ ఏజెంట్ మోసం చేశాడని బాధితులు గురువారం జగిత్యాలలో ఆందోళనకు దిగారు. వారి కథనం ప్రకారం జగిత్యాల ధర్మపురి రహదారిలో రాచకొండ మహేష్అనే వ్యక్తి విఘ్నేశ్వర కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. విజిట్ వీసాపై యూరప్‌లోని సైప్రస్ తీసుకెళ్లి కంపెనీలో వర్క్పర్మిట్తో రూ.1.50లు నెల వేతనంతో పని కల్పిస్తానని నమ్మించాడు. దీనికి ఆకర్షితులైన 180 మంది యువకులు ఒక్కొక్కరు రూ.3 నుంచి రూ.4 లక్షలు చొప్పున దాదాపు రూ.9 కోట్ల వరకు చెల్లించారు. ఉద్యోగం, జీతం అన్నీ ఇప్పిస్తానంటూ రాచకొండ మహేష్ బాండ్ పేపర్ కూడా రాసిచ్చాడు. అయితే 5 రోజులుగా కన్సల్టెన్సీ కార్యాలయం మూసి ఉండడంతో బాధితులు పోలీసు కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. తమ డబ్బుల పరిస్థితి ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
Galf Agent Frud in Nizamabad : నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే తరహా మోసం వెలుగుచూసింది. డిచ్‌పల్లికి చెందిన ఓ గల్ఫ్ ఏజెంట్(Gulf Agent) ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల చొప్పున రూ.4 కోట్ల మేర వసూలు చేసి ఉడాయించాడు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్తామన్న ఆశతో డబ్బులు చెల్లించిన వారిలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన వారు కూడా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం లక్ష్మిపూర్ తండాకు చెందిన ముగ్గురు, బరిగెల గూడెంనకు చెందిన ముగ్గురిని మలేషియా పంపుతానని గంభీరావుపేటకు చెందిన ఓ ఏజెంట్ రూ.3.60 లక్షలు వసూలు చేశాడు. వారికి నకిలీ వీసాలు ఇవ్వడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సదరు ఏజెంట్‌ను జులైలో అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన ఓ వ్యక్తి 9 మందిని మలేషియా పంపుతానని మోసం చేసినట్లు ఎస్పీకి ఫిర్యాదు అందింది. ఈ మోసాలు పెరిగిపోతూ ఉండడంతో పోలీసులు చర్యలు వేగవంతం చేశారు.
ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో మోసం.. ముఠా అరెస్టు
Youth Attract Jobs in Foreign Countries : కాగితాలపై లెక్కలు బేరీజు వేసుకుంటున్న యువత వెంటనే పాస్‌పోర్ట్, ఇతర గుర్తింపు కార్డులు వారికి అప్పగిస్తున్నారు. వీసా వచ్చేసిందని నమ్మించి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంటర్వ్యూలు, మెడికల్ పరీక్షల పేరిట నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు. ఇలా గల్ఫ్ దేశాలకు పంపించకుండానే నిలువునా మోసగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి రోజుకు 80-100 మంది కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. వీరిలో 60 వరకు మంది హైదరాబాద్ మీదుగా.. మిగతావారు ట్రావెల్స్ కంపెనీల ద్వారా ముంబయి నుంచి విదేశాలకు వెళ్తున్నారు.
Tom com Organization Activity : సమైక్య రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నెలకొల్పిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీతో పాటు 29 కంపెనీలకు మాత్రమే లైసెన్స్ ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం ఐదింటికీ మాత్రమే అనుమతి ఉంది. అయితే ఉపాధి ఆశతో అనేక మంది బోగస్ ఏజెంట్ల బారిన పడి మోసపోతున్నారు. వీటిని అరికట్టడానికి రెండేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్‌కామ్ పాత్ర నామమాత్రంగా మారింది. నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేయటంతో పాటు గల్ఫ్‌లో ఉన్న ఉపాధి అవకాశాలకు యువతను ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన ఈ సంస్థ క్రియాశీల పాత్ర పోషించడం లేదనే విమర్శలు ఉన్నాయి. గల్ఫ్‌లో ఉన్న కంపెనీలతో ఒప్పందం చేసుకొని.. తెలంగాణలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు(Employment) కల్పించే పాత్రను ఇది సరిగా పోషించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో లైసెన్స్ పొందిన ఏజెంట్లు 110 మంది ఉండగా జగిత్యాల జిల్లాలో 25 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 మంది ఉన్నారు. అయితే తాము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు అంటున్నారు.
జిల్లా కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలి : ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లిన వారి సమస్యలు పరిష్కరించేందుకు పలు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటుతో పాటు.. సచివాలయంలో ఉన్న ఎన్నారై సెల్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా బయట ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జిల్లా కేంద్రాల్లోనూ హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని.. విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరుతున్నారు. విమానాశ్రయంలోనూ సహాయ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు తెల్లకార్డు ఉంటేనే.. మృతదేహాన్ని విమానాశ్రయం నుంచి వారి ఇళ్లకు చేర్చే నిబంధనను సడలించాలని.. వివిధ కారణాలతో విదేశాల్లోని జైళ్లలో మగ్గుతున్న వారి విడుదలకు కృషి చేయాలని తెలిపారు. ఎంబసీలలో తెలుగు అధికారులను నియమించాలనే డిమాండ్‌తో పాటు.. హైదరాబాద్‌లో సౌదీ ఎంబసీని ఏర్పాటును కోరుతున్నారు.
Deepfake Voice Cloning : 'డీప్ ఫేక్' మోసం.. స్నేహితుడిలా మాట్లాడి రూ.30వేలకు టోకరా