కరీంనగర్‌లోని ప్రజలు రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కరోనా కారణంగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూనే... అన్నా, తమ్ముళ్లకు రాఖీలు కట్టారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు తన సోదరి రాఖీ కట్టి మిఠాయి తినిపించారు.
నగర పాలక సంస్థ మేయర్ వై.సునీల్ రావుకు కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి పండుగను జరుపుకోవాలని సూచించారు. అనవసరంగా బయటకు రావొద్దదని... ఒకవేళ వచ్చినా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాపటించాలని అన్నదమ్ములకు అక్కాచెల్లెల్లు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..