ETV Bharat / state

వైభవంగా ముగిసిన శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు - కరీంనగర్​ శ్రీ వేంకటేశ్వరస్వామి తృతీయ బ్రహ్మోత్సవాలు

కరీంనగర్​లో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆలయ ప్రాంగణమంతా భక్తుల గోవింద నామ స్మరణతో ప్రతిధ్వనించింది. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన శ్రీ పుష్పయాగం కన్నుల పండువగా కొనసాగింది. చిన్నారుల గానాలాపన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వైభవంగా ముగిసిన శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Feb 3, 2020, 12:25 PM IST

కరీంనగర్​లో శ్రీ వేంకటేశ్వరస్వామి తృతీయ బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. కిక్కిరీసిన భక్తజనం మధ్య ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమోగిపోయింది. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా చివరిరోజు వసంతోత్సవము, చక్రతీర్థం, పుష్పయాగాలను నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ ఉత్సవమూర్తులకు నిర్వహించిన శ్రీ పుష్పయాగం కన్నుల పండువలా కొనసాగింది. తిరుమల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన సంపంగి పూలతో స్వామివారికి పుష్పాభిషేకం చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావటం వల్ల మార్కెట్​ రోడ్​లోని ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. ఈ​ కార్యక్రమంలో చిన్నారుల గానాలాపన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది.

వైభవంగా ముగిసిన శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ఇవీ చూడండి : 'తెరాసను ఎదుర్కొలేక సిద్ధాంతాలు మరిచి ఏకమవుతారా?'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.