కరీంనగర్ జిల్లా కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో కోతులు ఆహారం లేక విలవిలలాడుతున్నాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడే దేవాలయాన్ని కరోనా ఎఫెక్ట్‌తో మూసివేసినందున భక్తులు వెల్లకపోవడం వల్ల కోతులకు ఆహారం కరవైంది. కరీంనగర్‌కు చెందిన కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ కోతులకు ఆహారంగా పండ్లను అందిస్తున్నాడు. లాక్డౌన్ ఎత్తివేసే వరకు కోతులకు ఆహారం అందించడానకి దాతలు ముందుకు రావాలని ఆయన కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఐదు రోజులు అడుగు బయట పెట్టొద్దు