ETV Bharat / state

తొలిసారిగా ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో కరోనా టెస్టులు - చల్మెడ మెడికల్​ కళాశాల తాజా వార్తలు

తెలంగాణలో ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో కరోనా టెస్టుల ప్రక్రియ తొలిసారిగా కరీంనగ‌ర్‌లో ప్రారంభమైంది. చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థలో ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ శశాంక ప్రారంభించారు. యాజమాన్యం సుమారు రూ.40 లక్షల పరికరాలను సమకూర్చిందన్నారు.

తొలిసారిగా ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో కరోనా టెస్టులు

author img

By

Published : Jun 29, 2020, 7:01 PM IST

రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో కొవిడ్‌ పరీక్షల ప్రక్రియ మొట్టమొదటి సారిగా ప్రారంభమైంది. కరీంనగర్‌ చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థలో కరోనా టెస్టుల ప్రక్రియను మెడికల్‌ కళాశాల ఛైర్మన్‌ లక్ష్మీ నర్సింహారావు, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతితో కలిసి కలెక్టర్‌ కె.శశాంక ప్రారంభించారు.

మెడికల్‌ కళాశాల యాజమాన్యం దాదాపు రూ.40లక్షల పరికరాలను సమకూర్చిందని కలెక్టర్‌ శశాంక తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి సదుపాయం కరీంనగర్‌లో ప్రారంభం కావటం సంతోషకరమన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ. 2,200తో పరీక్షల చేసేందుకు సిద్దమని కళాశాల ఛైర్మన్‌ లక్ష్మీ నరసింహారావు పేర్కొన్నారు. ఒకరోజు 160 మందికి పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని, త్వరలోనే రెట్టింపు చేస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం పలువురికి ఉచిత వైద్య సేవలు కూడా అందించనున్నట్లు ఛైర్మన్‌ వెల్లడించారు.

ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్​ అలీకి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.