పంటపొలాలో విద్యుత్ తీగలు వరిపైర్లను తాకుతూ ఏర్పాటు చేశారని.. గాలుల వల్ల రాపిడికి గురై మంటలు వ్యాపిస్తున్నాయని భాజపా నేతలు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో విద్యుత్ తీగల వల్ల అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయని భాజపా నేత గడ్డం నాగరాజు అన్నారు. గన్నవరంలో జరిగిన అగ్ని ప్రమాదానికి కరెంట్ తీగలే కారణమని తేల్చి చెప్పారు. ఈ మేరకు స్థానిక భాజపా నాయకులు తహసీల్దార్ రమేశ్ కు వినతి పత్రం అందజేశారు.
పంట పొలలో విద్యుత్ వ్యవస్థ పరిశీలిస్తే.. ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తాయని వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని.. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో ‘హిమాయత్’ సాగుకు ప్రోత్సాహం