కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఓ పెళ్లి ఇంట్లో విషాదం జరిగింది. పట్టణానికి చెందిన మేకల దాసు శుక్రవారం తన పెద్ద కూతురు వివాహం జరిపించాడు. బంధువులంతా పెళ్లికి వచ్చి... నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందరూ సంతోషంగా భోజనాలు చేశారు. అనంతరం సాయంత్రం వేళ ఊరేగింపు మొదలైంది. అందరూ ఆనందంగా నృత్యాలు చేస్తున్నారు.
పెళ్లింట్లో విషాదం... నృత్యం చేస్తూ తండ్రి మృతి అందరితో దాసు నృత్యం చేశాడు. ఇంతలో... ఆకస్మాత్తుగా దాసు కిందపడిపోయాడు. కాలు జారి పడ్డాడేమో అని అనుకున్నారు. గుంపులోంచి పక్కకు తీసుకెళ్లి సపర్యలు చేశారు. కానీ స్పృహ రాలేదు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే దాసు గుండెపోటుతో మరణించారని వైద్యులు తేల్చారు. దాసు మృతితో సంతోషంగా ఉన్నవారంతా విషాదంలో మునిగిపోయారు. ఇవీ చూడండి: దెబ్బకు ఠా.. ఓజీ దొంగల ముఠా..!