కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని పలుగ్రామాల రైతులు శ్రీరాంసాగర్ వరద కాల్వకు నీళ్లివ్వాలని ఆందోళనకు దిగారు. కరీంనగర్-జగిత్యాల రహదారిపై అన్నదాతలు బైఠాయించటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొండన్నపల్లి, కురిక్యాల, తాడిజెర్రి, రంగరావుపల్లి గ్రామాల రైతులు ధర్నా నిర్వహించగా...ఎమ్మెల్యే రవిశంకర్ వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి:నకిలీ వీసాలతో 20 మంది మహిళల అరెస్టు