కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో బుచ్చయ్య అనే రైతు చేతికందిన ధాన్యాన్ని విక్రయ కేంద్రానికి తరలించారు. ధాన్యాన్ని నూర్పుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి రైతులు అక్కడి చేరుకుని.. అతన్ని చూసేసరికి మరణించాడు.
వడదెబ్బ తగిలి బుచ్చయ్య మరణించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇతని భార్య గతంలో సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు. బుచ్చయ్య మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చదవండి: వలస కూలీలను ఫోన్ నంబర్‌తో పట్టేస్తారు