ETV Bharat / state

ETELA RAJENDER: "కేసీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే 'దళితబంధు' రాష్ట్రమంతా అమలుచేయాలి"

సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రమంతా దళితబంధు అమలు చేయాలని భాజపా నేత ఈటల రాజేందర్​ డిమాండ్​ చేశారు. ఎవరు ఎన్ని చేసినా హుజూరాబాద్​లో ఎగిరేది కమలం జెండానే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ETELA RAJENDER: 'సొంత పార్టీ మనుషులను కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్​దే'

author img

By

Published : Aug 19, 2021, 12:05 PM IST

Updated : Aug 19, 2021, 12:32 PM IST

సీఎం కేసీఆర్ ప్రతిష్ఠ, గౌరవం మసకబారిందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్​ అన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠ అధోపాతాళానికి పడిపోయిందని ఆయన ఆరోపించారు. సొంత పార్టీ మనుషులను కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్‌దేనని ఈటల విమర్శించారు. హుజూరాబాద్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రమంతా దళితబంధు అమలు చేయాలని ఈటల రాజేందర్​ డిమాండ్​ చేశారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్లకే రూ.40-45 వేల కోట్లు చెల్లించాలని తెలిపారు. ఎవరు ఎన్ని చేసినా హుజూరాబాద్​లో ఎగిరేది కమలం జెండానే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గర్వపడుతున్నా..

ముఖ్యమంత్రి ప్రతిష్ఠ, గౌరవం ఇవాళ అధఃపాతాళానికి పడిపోయింది. కేసీఆర్​ పాలనలో హుజూరాబాద్​లో ఏం జరిగిందంటే.. వందల కోట్ల రూపాయలు పెట్టిండు. సొంత పార్టీలోని మనుషులనే కొన్న చరిత్ర ఇవాళ కేసీఆర్​కు మాత్రమే దక్కింది. ఒక ఈటల రాజేందర్​ను ఓడిగొట్టాలని కుంచితపు బుద్ధితో చేసిన పనులు, నిర్ణయాలు నా జాతికి, రాష్ట్రానికి అక్కరకు వచ్చినట్లుగా భావిస్తా ఉన్నా. ఆ ఫలితాలు వాళ్లకు అందుతున్నందుకు నేను గర్వపడుతున్నా. నా ఎమ్మెల్యే రాజీనామా ఫలితాల కన్నా.. ఇప్పుడు వస్తున్న ఫలితాలను చూసి గర్వపడుతున్నా. -ఈటల రాజేందర్​, భాజపా నేత

ETELA RAJENDER: "కేసీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే 'దళితబంధు' రాష్ట్రమంతా అమలుచేయాలి"

ఇదీ చదవండి: kishan reddy: 'జనాభా ఎక్కువున్న దేశంలో కరోనాను ఎదుర్కోవడం కష్టమే'

Last Updated : Aug 19, 2021, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.