కష్టాలు, బాధలో ఉన్నవారికి ఓదార్పు ఇవ్వడం అభినందనీయమని కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. హెల్ప్ ఎస్ ఇండియా హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో.. పట్టణంలోని పేదలు, వృద్ధులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నియమాలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరింత అప్రమత్తత అవసరం
వర్షాలు కురుస్తున్నందు వల్ల రానున్న మరో రెండు నెలలు మరింత అప్రమత్తంగా ఉండాలని శ్యాం ప్రసాద్ లాల్ సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని.. భౌతికదూరం, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితులలో పేదలకు మానవతాదృక్పథంతో సహాయం చేస్తున్న వారిని అభినందించారు.
ఇదీ చూడండి: కరోనా మహమ్మారికి చిక్కి పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి