ETV Bharat / state

కూలీలకు పని కల్పిస్తున్న ఉపాధి హామీ పథకం - drda

గ్రామాల్లో కూలీలకు పని కల్పించే లక్ష్యంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చేపట్టారు. కరీంనగర్​ జిల్లాలో ఉపాధి హామీ పనుల గురించి డీఆర్​డీఏ ప్రాజెక్ట్​ డైరెక్టర్​ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు.

drda pd explain about Mahatma Gandhi National Rural Employment Guarantee Act
కూలీలకు పని కల్పిస్తున్న ఉపాధి హామీ పథకం
author img

By

Published : May 12, 2020, 11:37 PM IST

కరీంనగర్ జిల్లాలో లాక్​డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా పాలనాధికారి శశాంక ఆదేశాల మేరకు గ్రామాల్లో కూలీలకు పని కల్పించే లక్ష్యంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చేపట్టారు. కూలీలందరి ఆరోగ్య పరిరక్షణకు శ్రద్ధ చూపుతోనే గ్రామాల్లో నీటి వనరుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ పనులు పర్యవేక్షిస్తున్న డీఆర్​డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు ఈ పనుల వివరాలు వెల్లడించారు.

ఉపాధి హామీ పనుల లక్ష్యం....

కరీంనగర్ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి 55 లక్షల 21వేల 500 రూపాయల విలువ గల పనిదినాలు కల్పించడాన్ని లక్ష్యంగా నిర్దేశించారు. ఉపాధి పనుల్లో నిత్యం హాజరవుతున్న వారు 83 వేల 907 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం లక్షా 28వేల 322 కూలీల పేర్లు నమోదై ఉన్నారు.

వేసవిలో అదనంగా 30 శాతం చెల్లింపు...
మే నెలలో వేసవి తీవ్రత దృష్ట్యా 30 శాతం వేతనం అదనంగా పొందడానికి అవకాశం ఉంది. నిర్దేశిత ఏడు గంటలు పని చేయటంతో మట్టి పనికి సరాసరి రూ.183 పొందే వీలుంది. సాధారణంగా రోజు కూలీ రూ.237 ఉండగా.. కొలత ప్రకారం పని చేసిన మేరకు వేతనం చెల్లించే అవకాశం ఉంది.

గ్రామాల్లో నీటి వనరుల పునరుద్ధరణ పనులు
ఉపాధి హామీ పథకం పనుల్లో ప్రధానంగా చెరువులో పూడికతీత పనులు, ఫీడర్​ ఛానల్​ పూడిక తీతలు, పొలాల్లో ఒండ్రుమట్టి తొలగించడం, చేపల చెరువుల నిర్మాణం పనులను చేపట్టేందుకు ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి గ్రామంలో నిత్యం 150 మంది కూలీలు పనుల్లోకి వచ్చే విధంగా పంచాయతీ కార్యదర్శితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయం చేయాల్సి ఉంటుంది.

కూలీలకు ఆరోగ్య పరిరక్షణ చర్యలు...
ఉపాధి హామీ పథకం పనులు చేపట్టే కూలీలకు నిత్యం ఓఆర్​ఎస్​ పాకెట్లు అందజేస్తూ మాస్కులు ధరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. శానిటైజర్లు పని క్షేత్రాల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారని డీఆర్​డీఏ ప్రాజెక్ట్​ డైరెక్టర్​ తెలిపారు.

కూలీలకు చెల్లింపు విధానం...
ఉపాధి కూలీలకు 15 రోజుల్లో వేతనం లభించే విధంగా సాంకేతిక సహాయకులకు రెండు విడతల వారీగా కొలతలు తీసుకునేందుకు నిర్దేశించామని తెలిపారు. సోమవారం నుంచి శనివారం వరకు పనులు చేపట్టే వారిని ఒక సమూహంగా లెక్కించి చెల్లింపు చిట్టీలు అందజేస్తారు. గురువారం నుంచి తిరిగి బుధవారం వరకు మరొక సమూహంగా లెక్కించి చెల్లింపు చిట్టీలు అందజేస్తారు. వీరందరికీ తర్వాత వారంలో కూలీ డబ్బులు కచ్చితంగా చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని డీఆర్​డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు చెప్పారు.

ఇవీ చూడండి: ప్రభుత్వం చెప్పిన పంటలు సాగు చేస్తేనే రైతుబంధు, మద్దతు ధర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.