ETV Bharat / state

బాలుడిపై కుక్క దాడి... ముఖానికి తీవ్రగాయాలు - బాలుడికి తీవ్రగాయాలు

ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై శునకం దాడి చేసింది. ఈ దాడిలో అతని ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

Dog bite on two years old boy i
బాలుడిపై శునకం దాడి
author img

By

Published : May 8, 2021, 9:51 PM IST

సంతోషంగా ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై ఓ కుక్క దాడి చేయగా అతని ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన బట్టు రాజు కుమారుడు హర్షవర్ధన్ (2) ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్క దాడికి పాల్పడింది. ఇదీ గమనించిన తల్లిదండ్రులు బాలుడిని వెంటనే 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

బాలుడి చెంపపై, భుజంపై గాయాలు కావడంతో చికిత్స చేసి ఇంటికి పంపించారు. తల్లిదండ్రులు చిన్న పిల్లలు పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని పలువురు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.