ETV Bharat / state

60 లక్షలతో రోడ్ల నిర్మాణానికి మేయర్​ శంకుస్థాపన - కరీంనగర్​లో రోడ్ల నిర్మాణఁ

కరీంనగర్​ నగరంలో 60 లక్షల రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణానికి మేయర్​ సునీల్​రావు శంకుస్థాపన చేశారు. దానితో పాటు స్మార్ట్​ సిటీ పనులను పరిశీలించారు.

developing works started karimnagar
60 లక్షలతో రోడ్ల నిర్మాణానికి మేయర్​ శంకుస్థాపన
author img

By

Published : Jul 15, 2020, 5:08 PM IST

కరీంనగర్​ నగరంలో ప్రతిరోజు నీటి సరఫరాకు రంగం సిద్ధమైందని మేయర్​ సునీల్​రావు తెలిపారు. నగరంలో 60 లక్షల రూపాయలతో కొత్తరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు.. స్మార్ట్​సిటీ పనులను పరిశీలించారు.

దిగువ మానేరు జలాశయం ఉన్నా.. తాగునీటి విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. దాదాపు 108 కోట్ల రూపాయలతో పైప్​లైన్ల నిర్మాణంతో ట్రయల్​రన్​ కూడా పూర్తి చేసినట్లు మేయర్​ తెలిపారు. ఈనెల 17 నుంచి నగరంలో ప్రతిరోజు తాగునీటి సరఫరా చేస్తామని మేయర్​ వివరించారు. ఇప్పటికే స్మార్ట్​ సిటీ నిధులతో పలు అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని.. మరో 60 కోట్లతో నగరంలో అత్యవసర పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు మేయర్​ సునీల్​రావు చెప్పారు.

ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.