కరీంనగర్ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు ఆకట్టుకున్నాయి. శాతవాహన విశ్వవిద్యాలయం ఆవరణలో చేపట్టిన ఈ పోటీలను కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్తో పాటు అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని జేసీ అన్నారు. ప్రతి ఒక్కరూ సైక్లింగ్ చేసేందుకు ఇప్పటికే చాలాసార్లు పోటీలు నిర్వహించామని.. ప్రతి ఒక్కరిలో ఉత్సాహం తీసుకురావడంలో కరీంనగర్ సైకిల్ అసోసియేషన్ తోడ్పడుతుందని నరేందర్ రెడ్డి తెలిపారు. సైక్లింగ్ పోటీల్లో రాణించిన వారిని రాష్ట్రస్థాయి సైకిల్ పోటీలకు ఎంపిక చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి : శ్రీశైలంలో జలదృశ్యం- 10 గేట్ల నుంచి ప్రవాహం