ETV Bharat / state

కాలువ కింద పొలాలు.. అయినా తప్పని సాగు నీటి కష్టాలు - crop fields are dried due to no water

No water supply for Crop Fields: అడుగంటిన కాలువలు.. బీటలు వారిన నేలలు.. ఎండిపోయిన పంటలు. ఇదీ కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌, కొత్తపల్లి మండలాల్లో పరిస్థితి. కాలువ పక్కనే ఉన్నా.. నీరందక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భూగర్భజలాలు అడుగంటిపోవడం, కరెంటు కోతలు రైతుల్ని మరింత వేధిస్తున్నాయి. లక్షల పెట్టుబడులు పెట్టినా.. చేతికొందే సమయానికి పంట ఎండిపోవడంతో రైతులు కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది.

No water supply for Crop Fields:
సాగు నీరులేక ఎండిపోతున్న పంటపొలాలు
author img

By

Published : Apr 23, 2022, 6:40 PM IST

No water supply for Crop Fields: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చూసి రైతు విలవిలలాడుతున్నాడు. పంట చేతికందే సమయానికి నీరు అందక ఎండిపోతుంటే తల్లడిల్లుతున్నారు. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి, రేకుర్తిలో ఎస్సారెస్పీ డీ-93 కింద సాగు చేసుకుంటున్న రైతులు.. నీరందక పొలాలు బీటలు పారుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ నుంచి నీరందక పోగా.. కరెంటు కోతలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పెట్టుబడులు పెట్టినా కాలువ నీళ్లు రాకపోవడం, విద్యుత్‌ కష్టాలతో పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.

మానకొండూర్‌, కొత్తపల్లి మండలాల్లో రైతుల కన్నీటి వ్యథ

సీఎం సూచనతో ఆరుతడి పంటలు పండించినా.. అక్కడి రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు. చేతికొచ్చిన పంట ఎండిపోతుండటంతో వరిపొలాన్ని పశువుల మేతగా వేయాల్సిన దుస్థితి దాపురించింది. లక్షలు ఖర్చు పెట్టి సాగు చేస్తే.. చివరికి పంట చేతికొచ్చే సమయానికి నీరు లేక పంట ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కోసం పాలకులు, అధికారులను అడిగినా పట్టించుకోకపోవడంతో ఏం చేయలేని స్థితిలో ప్రాణం పోతున్న పంటను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు.

"పొలానికి నీళ్లు రావడం లేదు. వారం రోజులుగా కరెంటు కూడా సరిగా ఉండటం లేదు. సాగు నీరు లేక వడ్లన్నీ నూకలుగా మారుతున్నాయి. ధాన్యం అమ్మేటప్పుడు నూకల పేరుతో మాకు కోత విధిస్తారు. పల్లె ఎండిపోతుంది. పంట చేతికి రాకపోతే చావు తప్ప మాకు వేరే దారి లేదు." -నరహరి రాజిరెడ్డి, రైతు, కొత్తపల్లి

మానకొండూరు మండలం చెంజర్ల, పెద్దూరుపల్లి, నిజాయితీగూడెం ప్రాంతాలకు తోటపల్లి రిజర్వాయర్ ద్వారా నీరందించేందుకు.. చిగురుమామిడి, తిమ్మాపూర్ మండలంలోని గ్రామాల మీదుగా కాలువ నిర్మాణం చేపట్టారు. తిమ్మాపూర్ మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు.. కిందనున్న కొన్ని గ్రామాలకు నీరు రాకుండా.. కెనాల్‌ వద్ద అడ్డుకట్టలు వేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. పొట్టదశలో నీరులేక పంట ఎండిపోతుండటంతో ఏం చేయాలో తెలియడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

"శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్టులో నీరున్నా కూడా మాకు సాగు నీరు ఆపేశారు. గింజ పాలు పోసుకునే దశలో ఉంది. ఈ సమయంలో నీరు అందించకపోతే పంట చేతికి రాదు. పంట ఎండిపోతుండటంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. కాలువ పక్కనే ఉన్నా సాగు నీరు అందే లేదు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు మా బాధలను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం." -మహేందర్​, రైతు, మానకొండూరు

పంట పొట్టదశలో ఉండటంతో.. నీటిపారుదలశాఖ అధికారులు దయచూపి నీరందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్​ కోతలతో మరిన్ని ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. విద్యుత్ కోతల సమస్య తొలగించి.. సాగు నీటి సమస్య తలెత్తకుండా చూడాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇవీ చదవండి: కోట్ల జీతం వదిలేసి.. నృత్యమే జీవితంగా చేసుకున్న నిహంత్రీ..

50 కేజీల నిమ్మకాయలు చోరీ.. ధర రూ.20 వేలకుపైనే.. సీసీటీవీ దృశ్యాలు వైరల్

దేశం ప్రశాంతంగా ఉందంటే వారే కారణం: రామ్​చరణ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.