ETV Bharat / state

'వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి' - కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్ గ్రామంలో వడగండ్ల వాన

వడగండ్ల వానకు కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్​లో తడిచిన ధాన్యాన్ని, పంటలను, కూరగాయ తోటలను, మామిడి తోటలను సీపీఎం కార్యకర్తలు పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

farmers facing problems
'వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'
author img

By

Published : May 10, 2020, 8:20 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో కురిసిన వడగండ్ల వానకు చేతికొచ్చిన పంటలతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కూడా పూర్తిగా నాశనమయింది. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బండారి శేఖర్, కవ్వంపల్లి అజయ్, రాజు, చరణ్ డిమాండ్ చేశారు.

20 రోజుల నుంచి రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే ఉంటున్నారని అన్నారు. వడ్లను, మక్కలను కొనుగోలు చేసే దిక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజనూ కొంటామని చెప్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంటలను కొనట్లేదని ఆరోపించారు.

ఇవీ చూడండి: మాజీ మంత్రి రత్నాకర్​రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.