ETV Bharat / state

మళ్లీ కరోనా పంజా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కరోజే 32 కేసులు

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తోరిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఒక్కరోజే 32 మందికి కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వచ్చిన వారి ద్వారానే సంక్రమిస్తున్నట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. పట్టణాల్లో కనిపించిన తీవ్రత క్రమంగా పల్లెలకు పాకింది. కేసులు పెరుగుతుండడం వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

corona-virus-update-in-joint-karimnagar-district
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 32 కేసులు
author img

By

Published : Jul 5, 2020, 11:07 AM IST

కరోనా వైరస్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాను వణికిస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపుగా అన్ని ప్రాంతాలకు ఇది విస్తరించింది. చాపకింద నీరులా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఒక్కరోజే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 32 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. కరీంనగర్‌ జిల్లాలో 16 కేసులు , సిరిసిల్ల జిల్లాలో ఏడు, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో నాలుగు చొప్పున కేసులున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల్లో వెల్లడించింది.

గడిచిన నెల రోజుల నుంచి ఊహించని విధంగా పాజిటివ్‌ కేసులు జిల్లాల్లో పెరుగుతుండటం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 16కు పెరిగింది. ఇక అనుమానిత లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య అనధికారింగా ఎక్కువగానే ఉంది.

క్రమంగా పల్లెలకు..
ఇటీవల బయటపడుతున్న కేసుల మూలాలన్నీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో ముడిపడినవే కావడం గమనార్హం. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు, ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణ తరువాత ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి రాకపోకల తీరు క్రమంగా పెరిగింది. ఈ తరుణంలోనే తాజాగా రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వచ్చిన వారి ద్వారానే సంక్రమిస్తున్నట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది .

దీంతో హైదరాబాద్ ప్రయాణమంటేనే నాలుగు జిల్లాల ప్రజలు కలవర పడే పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకు పట్టణ ప్రాంతాల్లో కనిపించిన తీవ్రత క్రమంగా పల్లెలకు పాకింది. మొదట్లో జగిత్యాల జిల్లాలో మహారాష్ట్ర నుంచి సొంత జిల్లాకు వచ్చిన వలస కార్మికుల రూపంలో వైరస్‌ ప్రభావం అధికంగా కనిపించింది. ఇలా వారం, పది రోజుల వ్యవధిలోనే 60వరకు కేసులు ఈ జిల్లా ప్రజలను కలవరానికి గురిచేశాయి. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకే సుమారుగా 5వేల మంది వరకు వలస కార్మికులు తిరిగి స్వగ్రామాలకు చేరుకుని స్వీయగృహ నిర్బంధంలో ఉన్నారు. కొత్తగా హైదరాబాద్‌కు వివిధ పనుల కోసం వెళ్లిన వారితో పాటు అటునుంచి జిల్లాలకు వస్తున్న వారి రూపంలో భయపెడుతోంది.

కరీంనగర్ నగరంలో తీవ్రరూపం..
కరీంనగర్‌ నగరంలో కరోనా వ్యాప్తి తీవ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు రాష్ట్రస్థాయిలోనే సంచలనానికి కేంద్ర బిందువైన కరీంనగర్‌లో మళ్లీ కేసులు పెరుగుతుండటం వల్ల కలకలం రేగుతోంది. సగటున రోజుకు నాలుగైదు కొత్త కేసులు ఆయా ప్రాంతాల్లో పుట్టుకువస్తుండటం వల్ల అందరిలో ఆందోళన తప్పడం లేదు. ఇటీవల రెండు వారాల్లోనే సుమారుగా 50కిపైగా కేసులు నగరంలోనే నమోదు కావడం గమనార్హం.

కంటైన్‌మెంట్ల పరిస్థితి గతంలో మాదిరిగా లేకపోవడం, పాజిటివ్‌ వచ్చిన వారు ఇళ్లల్లోనే గృహనిర్బంధంలో ఉంటుండటం వల్ల బాధితుడు నివాసముంటున్న కాలనీ వాసులు కలవరానికి గురవుతున్నారు. మరోవైపు నగరపాలక, పురపాలక సంస్థలు పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. రసాయన ద్రావణాల్ని ఆయా ప్రాంతాల్లో చల్లుతున్నారు.

ఇవీ చూడండి: కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.