కరోనా మహమ్మారి(Corona Pandemic) నుంచి రక్షణ పొందేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది వ్యాక్సిన్(Vaccine) తీసుకుంటున్నా కొంతమందిని మాత్రం ఇంకా అపోహలు వీడటం లేదు. లేనిపోని భయాలతో టీకా వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో 100శాతం వ్యాక్సినేషన్ మాట ఉంచి.. మళ్లీ మహమ్మారి విజృంభించే అవకాశం ఉంది. అందుకే తమ వంతుగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి కరీంనగర్ జిల్లా మల్లాపూర్(Mallapur)లో వైద్య సిబ్బంది వినూత్న ప్రయత్నం చేశారు.
మైకులో 'రావాలమ్మ రావాలి' అంటూ వినూత్నంగా ప్రచారం చేశారు. టీకా పట్ల ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. అందరూ టీకా తీసుకుంటే కరోనా(Corona) బారి నుంచి సురక్షితంగా బయటపడవచ్చవని సూచించారు.
ఆటో సహాయంతో మల్లాపూర్‌లోని అన్ని వీధుల్లో మైకు ద్వారా ప్రచారం చేశారు. టీకా వేసుకోని వారికి అక్కడే వ్యాక్సిన్(corona vaccine) వేస్తూ ముందుకు సాగారు. నూరు శాతం వ్యాక్సినేషన్(100 Percent Vaccination) లక్ష్యం పూర్తి చేయాలనే వైద్య సిబ్బంది సంకల్పం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి: 'రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదు.. చిరంజీవి, రజనీకాంత్లే కనుమరుగయ్యారు'