ETV Bharat / state

పట్టణాల నుంచి పల్లెలకు పాకుతున్న కరోనా.. భయాందోళనలో స్థానికులు - latest news of corona updates in karimnagar

కరీంనగర్​ జిల్లాలోని తిమ్మాపురం మండలంలో తాజాగా రెండు పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. హైదరాబాద్​ నగరం నుంచి పల్లెలకు వెళ్లిన వారిలో ఎక్కువగా వైరస్​ లక్షణాలు కనిపించడం వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

corona cases in karimnagar
పట్టణాల నుంచి పల్లెలకు పాకుతున్న కరోనా.. భయాందోళనలో స్థానికులు
author img

By

Published : Jul 8, 2020, 2:25 PM IST

కరోనా వైరస్ రాష్ట్రంలో విలయతాండవం సృష్టిస్తోంది.. పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెల వరకు వ్యాపిస్తోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇటీవలె హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చిన ఓ యువకుడికి పాజిటివ్​ నిర్ధరణ అయినట్టు అధికారులు తెలిపారు. కాగా అతన్ని క్వారంటైన్​లో ఉంచి బాధితుడి తల్లిదండ్రులను కరీంనగర్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా హైదరాబాద్​లో ఆర్టీసీ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న మరో వ్యక్తికి కరోనా నిర్ధరణ కాగా.. వైరస్​తోనే బాధితుడు తన స్వగ్రామానికి వెళ్లాడు. సమాచారం అందుకున్న ఆరోగ్య సిబ్బంది అతన్ని అతని కుటుంబ సభ్యులకు పరీక్షలు జరిపి హోమ్ క్వారంటైన్​లో ఉంచారు.

ఇదీ చూడండి: రెండో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.