కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తు సరకులను తీసుకున్నారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అల్పాదాయ వర్గాల ప్రజలకు కొంతమేరకైన లబ్ధి చేకుర్చాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ ఐక్యతను చాటాలని కోరారు.
ఇదీ చూడండి: దేశ రక్షణకు జవాన్ల ప్రాణ త్యాగం