కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్లో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ... కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో గ్రామంలోని రహదారిపై బైఠాయించారు.
నెల రోజుల నుంచి తేమ పేరిట కొనుగోళ్లు మరింత ఆలస్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. గంట సేపు ఆందోళన చేయటం వల్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. తాలు పేరిట ధాన్యం లెక్కల్లో కోత విధిస్తున్నారని ఆరోపణ చేశారు. షానగర్ చేరుకున్న తహసీల్దార్ కోమల్ రెడ్డి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శాంతించిన కాంగ్రెస్ నేతలు ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: ప్రియాంకరెడ్డి హత్య కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు