కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలోని రాయిని చెరువును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పరిశీలించారు. సమగ్ర మంచినీటి సరఫరా పథకం ద్వారా 31 గ్రామాలకు తాగునీరు అందించాలన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాయిని చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌గా రూ.35 కోట్లతో నిర్మించామని గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చెరువు డెడ్ స్టోరేజ్‌గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువును పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించకుంటే సుందరగిరి నుంచి వెళ్తున్న పైప్లైన్కి గండి కొట్టి చెరువులోకి నీళ్లు తెచుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'నీ బిడ్డలు బాగుంటే చాలా? పేదలు ఏమైనా పట్టదా?'