దేశరక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లు ర్యాడ మహేశ్, ప్రవీణ్కుమార్లకు కరీంనగర్లో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు నివాళులర్పించారు. కోమన్‌పల్లికి చెందిన మహేశ్‌తో పాటు ప్రవీణ్కుమార్లకు గీతాభవన్ కూడలి వద్ద టీఎన్జీవోలతో పాటు వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు కొవ్వొత్తులతో అశ్రునివాళి అర్పించారు.
సరిహద్దుల్లో జరిగిన దాడిని హేయమైన చర్యగా టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అభివవర్ణించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇరువురి కుటుంబాలకు వారు సానుభూతిని తెలిపారు. వారి ప్రాణత్యాగం వృథాకాదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వీర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు.. కదలిన ఇందూరు