ETV Bharat / state

Huzurabad Campaign: ఎన్ని కేసులుంటే అంత గొప్ప... హుజూరాబాద్​లో విచిత్ర పరిస్థితి! - Huzurabad by election candidates

హుజూరాబాద్​లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో (Huzurabad Campaign) దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తామే గొప్ప అంటూ ఎవరికి వారు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తనపై వందల కేసులున్నాయి... నాపై కూడా ఉన్నాయంటూ మరొకరు ఇలా ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. కేసులే ఆధారంగా ప్రచారం చేసుకుంటున్నా నాయకులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Huzurabad Campaign
Huzurabad Campaign
author img

By

Published : Oct 12, 2021, 7:55 PM IST

Updated : Oct 12, 2021, 8:08 PM IST

హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad By Election)ల్లో ఓటర్లను ఆకట్టుకొనేందుకు అభ్యర్థులు ఏ అంశాన్ని వదిలిపెట్టడం లేదు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు చేస్తున్న ప్రచారం (Huzurabad Campaign) ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఉద్యమం తరహాలోనే తాము రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాడామని చెప్పడానికి ఎవరికి వారే గొప్పగా కేసులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ ఎన్నికల కమిషన్‌(EC)కు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్న కేసులు చూస్తే ముక్కున వేలేసుకొనే పరిస్థితి ఉంది. దీనికి ఏ ఒక్క పార్టీ అతీతం కాదు. ఎవరికి వారే తాము తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించామని దానికి నిదర్శనమే తమపై ఉన్న కేసులని చెప్పి ఓటర్లను ఆకట్టుకొనే యత్నం చేస్తున్నారు. తొలుత కేసుల గురించి గొప్పగా చెప్పుకున్నా... ఆ తర్వాత విమర్శల జడివానలో తడిసిముద్దవుతున్నారు.

ఈటల కంటే ఎక్కువ..

హుజూరాబాద్ బరిలో నిలిచిన భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ (Bjp Candidate Etala Rajender) కంటే పార్టీలో సీనియర్​నని చెప్పుకుంటూ ప్రచారం నిర్వహించిన తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ (Trs Candidate Gellu Srinivas Yadav)... తనపై 130కి పైగా ఉద్యమ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఉద్యమ ప్రస్థానంలో ఉస్మానియా వేదికగా గెల్లు చేసిన పోరాటాల ఫలితమే ఈ కేసులని ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం తెరాస నాయకులు చేశారు. నియోజకవర్గంలో గెల్లు శ్రీనివాస్‌ అందుబాటులో లేకపోయినా ఉద్యమంలో నిజంగానే బాగా పనిచేశారేమోనని తొలుత భావించారు. అయితే... చేసిన ప్రచారానికి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల్లో ఎక్కడా లేని పొంతన కనిపించింది. తనపై కేవలం 3 కేసులు విచారణ దశలో ఉన్నాయని గెల్లు శ్రీనివాస్ వివరించారు. మిగతా కేసులన్నీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఎత్తివేసిందా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.

ఈటల రాజేందర్ ఇలా...

పార్టీలోకి... ఈటల రాజేందర్ మధ్యలో వచ్చిలో మధ్యలోనే వెళ్లిపోయారని అధికార పార్టీ చేసిన ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి తనదైన శైలిలో ప్రచారం చేశారు. తాను చేసిన పోరాటం గురించి ఉప్పల్‌ రైల్వేస్టేషన్‌ను అడిగినా చెబుతాయి. జమ్మికుంట స్టేషన్‌ను అడిగినా చెబుతాయి. జైలు గోడలనడిగితే చెబుతాయని పలుమార్లు ఈటల చెబుతూ వచ్చారు. ఎన్నోసార్లు జైలుకు వెళ్లాను. ఉస్మానియా వర్సిటీకి చెందిన పిల్లలు జైళ్లకు వెళితే తానే తీసుకొచ్చానని విసృత ప్రచారం చేశారు. అయితే ఈటల తనపై నమోదైన 19 కేసుల్లో 5 కేసులు విచారణ దశలో ఉన్నాయని వివరించారు.

కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి కూడా...

రాష్ట్ర ఉద్యమంలో కేసులు ఏం లేకపోయినా స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత విద్యార్థుల సమస్యలపై చేసిన పోరాటాల ఫలితంగా తనపై 24 కేసులు నమోదయ్యాయని కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ (Congress Candidate Balmuri Venkat) ప్రకటించారు. తానేమి పోరాటాల్లో జూనియర్​ని కాదని హుజూరాబాద్ ప్రజలకు చెప్పే యత్నం చేశారు. అంతేకాకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరైన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై వంద కేసులు నమోదయ్యాయని వ్యాఖ్యానించారు. కానీ వెంకట్ మాత్రం తన అఫిడవిట్​లో 8 కేసులు విచారణలో ఉన్నాయని పేర్కొనడం విశేషం.

కేసుల ఆధారంగా ప్రచారం...

తెలంగాణ ఉద్యమంలో తామెంతో పని చేశామని చెప్పుకునేందుకు భాజపా, తెరాస అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రం ఆవిర్భవించి ఏడేళ్లు గడుస్తున్నా... నేటికి తమపై ఉన్న కేసుల గురించి చెప్పుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తుండడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈటలే కాదు గెల్లు కూడా ఉద్యమకారుడే అన్న భావన కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఇందులో భాగంగా ఈటల కన్నా గెల్లు శ్రీనివాస్ కూడా ఉద్యమపరంగా సీనియర్ అని నమోదైన కేసులే ఎక్కువ అని ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేశారు. వీరి ప్రచారాన్ని ఆధారం చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ కూడా తనపై నమోదైన కేసులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తనపై ఉద్యమ కేసులు లేకపోయినా తాను చేసిన పోరాటాలపై నమోదైన కేసులని చెబుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు కూడా కేసుల ప్రస్తావన తీసుకొస్తూ ఓటర్లను ప్రభావితం చేసే దిశగా ప్రసంగాలు చేస్తుండడం గమనార్హం.

ఇదీచూడండి: huzurabad by election: తెరాస మంత్రుల పద్మవ్యూహంలో చిక్కని ఈటల..!

Last Updated : Oct 12, 2021, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.