లాక్డౌన్ వల్ల రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిపోయి తలసేమియా వ్యాధిగ్రస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రక్తదానం చేయడానికి పెద్ద ఎత్తున ముందుకు రావాలని యువతకు పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని యువత, తెరాస కార్యకర్తలు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జన్మదినాన్ని వేడుకగా చేసుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దాతలు తరలి వచ్చి రక్తదానం చేశారు. తెరాస కార్యకర్తలు రక్తదానం చేసిన వారికి పండ్లు పంపిణీ చేశారు.