Bandi Sanjay Fires on CM KCR: తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టడానికి రుణం కావాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసింది నిజం కాదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో బండి సంజయ్ పర్యటించారు. ఈనెల 5న బీఆర్ఎస్, బీజేపీ ఘర్షణలో జైలుకు వెళ్లోచ్చిన బీజేపీ నాయకులను ఆయన పరామర్శించారు. ఈ మేరకు కార్యకర్తలను సంజయ్ సన్మానించారు.
Bandi Sanjay Comments On CM KCR: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. మోటర్లకు మీటర్లు పెట్టేందుకు రుణం కావాలనే విషయమై సవాలును స్వీకరించి చర్చకు సిద్ధమా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఈనెల 5న తమ పార్టీ కార్యకర్తలపై బీఆర్ఎస్కు చెందిన గుండాలు దాడి చేశారన్నారు. ఎమ్మెల్యే ఈటల కాన్వాయ్‌పై దాడి చేసిన బీఆర్ఎస్ గుండాలను వదిలి బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయటం ఏమిటని ధ్వజమెత్తారు.
హుజురాబాద్‌లో ఈటలకు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. పోలీసు వ్యవస్థ దిగజారి పోయిందన్నారు. బీజేపీ కార్యకర్తలను కొట్టే హక్కు వారికి ఎవరు ఇచ్చారన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇంకా మూడు నెలలు మాత్రమే ఉంటుందని ఎద్దెవా చేశారు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందన్నారు.
'మేము తెలంగాణలో మోటర్లకు మీటర్లు పెడతాం. మాకు లోన్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందా.. రాయలేదా? అంటే ముఖ్యమంత్రిని కాదని కేంద్ర ప్రభుత్వం వచ్చి మీటర్లు పెడతారా. 50 శాతం షేర్ రాష్ట్ర ప్రభుత్వానిది 49 శాతం షేర్ కేంద్ర ప్రభుత్వానిది. ఎక్కువ షేర్ ఉన్నవారు ప్రైవేటీకరణ చేస్తారా, లేక తక్కువ ఉన్నవారు చేస్తారా. వాళ్లు ఇచ్చిన అభివృద్ధి మీద చర్చకు వారు సిద్ధంగా లేరు. 24 గంటలు మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే'. -బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: