గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లిలో పర్యటించారు. 81వ బూత్ కమిటీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి.
గ్రామాల్లో బూత్‌ల వారీగా కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నామని... త్వరలోనే వాటిని పూర్తి చేస్తామని బండి సంజయ్ తెలిపారు. బూత్‌ల వారిగా సమావేశాలను ఏర్పాటు చేసుకుంటామని పేర్కొన్నారు. కార్యకర్తలందరూ పార్టీ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, నాయకులు పోరెడ్డి కిషన్‌రెడ్డి, రఘు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అన్ని కేంద్రం ఇస్తే ఇంక మీరేం చేస్తారు?: బండి సంజయ్