గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ను కరీంనగర్ స్ధానం నుంచిఎంపీగా గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. కరీంనగర్లో పార్లమెంటరీ నియోజకవర్గ భాజపా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అవసరంచాలా ఉందన్నారు.సంజయ్‌ను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు.
ఇదీ చదవండి:ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి విజయం