ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్ మండల కేంద్రాల్లో భాజపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు.
ఎల్ఆర్ఎస్ను ఎత్తివేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎల్ఆర్ఎస్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్లకు వినతిపత్రాలను సమర్పించారు.
ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్ జీవో సవరించి రేపు విడుదల చేస్తాం : కేటీఆర్