ETV Bharat / state

తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాక.. ఎప్పుడంటే? - ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సమావేశం

BJP national president is coming to Telangana: బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపు కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ముగియనుంది. దీంతో ఎస్​ఆర్​ఆర్​ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. బహిరంగ సభకు జేపీ.నడ్డా ముఖ్య అతిధిగా రానున్నారు.

BJP national president is coming
రాష్ట్రానికి భాజపా జాతీయ అధ్యక్షుడు రాక
author img

By

Published : Dec 14, 2022, 5:19 PM IST

BJP national president is coming to Telangana: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా రేపు తెలంగాణకు రానున్నారు. బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపు కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను భాజపా రాష్ట్ర నాయకత్వం నిర్వహిస్తోంది. ఈ సభకు జేపీ.నడ్డా ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.

బహిరంగ సభలో పాల్గొనేందుకు జేపీ.నడ్డా ప్రత్యేక విమానంలో రేపు మధ్యాహ్నాం 2 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కరీంనగర్‌కు బయల్దేరుతారు. మధ్యాహ్నాం 3 గంటలకు సభా వేదికకు చేరుకుని 50 నిమిషాలు పాటు కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. సభ ముగించుకున్న అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయంకు చేరుకుని తిరిగి దిల్లీ వెళ్లనున్నారు. బహిరంగ సభకు జేపీ.నడ్డా ముఖ్య అతిధిగా వస్తున్న నేపథ్యంలో భాజపా రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ జనసమీకరణకు ప్లాన్‌ చేస్తుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.