భాజపా (Bjp) ముఖ్య నేతల సమావేశం ముగిసిన వెంటనే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajender) నివాసానికి వెళ్లారు. తరుణ్ చుగ్‌తో పాటు లక్ష్మణ్, డీకే అరుణ, రఘనందనరావు, రాజాసింగ్, ఎంపీ సోయం బాపురావు, రామచంద్రరావు, చంద్రశేఖర్, వివేక్‌తో కూడిన బృందం కూడా వెళ్లింది.
భాజపాలో ఈటలకు ఇవ్వబోయే ప్రాధాన్యతను తెలియజెప్పేందుకే ఆయన నివాసానికి కమలనాథులు వెళ్లినట్లు తెలుస్తోంది. తన గన్‌మెన్‌కు కొవిడ్ పాజిటివ్ రావటం వల్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. ఈ కారణంగా ఆయన ఈటల నివాసానికి వెళ్లలేకపోయారు.
ఈనెల 14న మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajender) కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ భాజపాలో చేరనున్నారు.
ఇదీ చూడండి: ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు