ETV Bharat / state

ETELA RAJENDER: 'కేసీఆర్‌ బానిసను నాపై పోటీకి దింపారు'

హుజూరాబాద్​లో అభ్యర్థి ఎవరైనా.. సీఎం కేసీఆర్​కు కావాల్సింది బానిసే అని భాజపా నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. బానిస బిడ్డ కావాలో.. హక్కుల కోసం పోరాడే బిడ్డ కావాలో ప్రజలే తేల్చుకుంటారన్నారు. హుజూరాబాద్​లో బుధవారం జరిగిన కుల సమ్మేళన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ETELA RAJENDER
ETELA RAJENDER
author img

By

Published : Aug 12, 2021, 9:01 AM IST

'హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో నాపై ఓ బీసీ బిడ్డను పోటీలో దింపుతున్నారు. అభ్యర్థి ఎవరైనా కావొచ్చు కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కావాల్సింది ఓ బానిస. బానిస బిడ్డ కావాలో.. ప్రజల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడే బిడ్డ కావాలో ప్రజలే తేల్చుకుంటారు' అని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. హుజూరాబాద్​లోని మధువని గార్డెన్స్‌లో బుధవారం జరిగిన కుల సమ్మేళన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘

'ఇప్పటికే హుజూరాబాద్‌లో రూ.192 కోట్లు ఖర్చు చేశారు. ఏది అడిగితే అది ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భాజపా నాయకులతో పాటు తెరాస ఇన్‌ఛార్జులపై కూడా నిఘా పెట్టారు. నా రాజీనామా వల్ల ఏడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు ఒక్క హుజూరాబాద్‌కే కాకుండా యావత్‌ తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి' అని డిమాండ్‌ చేశారు. కుల సంఘాలకు అద్భుతమైన శక్తి ఉందని, అధికార పార్టీ అరాచకాన్ని కూకటివేళ్లతో పెకలించాలని పిలుపునిచ్చారు. 'తెలంగాణలో రాజకీయ విలువలు లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అరాచకం మాత్రమే ఉంది. నన్ను చిన్నోడు అని సంబోధించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఎన్నికల్లో ఈ చిన్నోడి కోసం వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు' అని ప్రశ్నించారు.

నేనెవరికీ భయపడటం లేదు..

హైదరాబాద్‌లో ఏ భూములు కన్వర్షన్‌ చేయాలన్నా కేసీఆర్‌, కేటీఆర్‌లకు తెలియకుండా జరగవని ఈటల రాజేందర్‌ అన్నారు. 'దమ్ముంటే హుజూరాబాద్‌లో పోటీ చేస్తే తేల్చుకుందామని కేసీఆర్‌, హరీశ్‌రావులకు సవాల్‌ విసిరాను. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులను అడుగుతున్నా. 2014కు పూర్వం మీ బిజినెస్‌ ఏంటో.. నా బిజినెస్‌ ఏంటో తెలుసు. మీ ఆస్తులేంటో.. నా ఆస్తులేంటో తెలుసు. నాకు రూ.1,000 కోట్ల కాంట్రాక్టు ఇచ్చామని చెబుతున్నారట. రూ.100 కోట్ల భూమికి సాయం చేశాం అంటున్నారట. ఇది ఎంత నీచమంటే పరిశ్రమ నెలకొల్పాలంటే భూమి కన్వర్షన్‌ చేసుకోవాలి. పౌల్ట్రీ పరిశ్రమకు ఆ అవసరం లేదు. నా క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ తప్పూ చేయలేదు కాబట్టే నేనెవరికీ భయపడటం లేదు' అని ఈటల స్పష్టం చేశారు.

పార్టీకి ఈటల ద్రోహం చేశారు..

మరోవైపు హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని ప్రకటించిన రోజే మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తల్లి లాంటి పార్టీకి ఈటల ద్రోహం చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తండ్రిలాంటి కేసీఆర్‌తో పాటు.. నన్ను రారా అంటున్నాడని, తాము మాత్రం రాజేందర్ గారూ అని మాత్రమే సంబోధిస్తామని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. రాజేందర్‌ను ఎమ్మెల్యే, మంత్రిని చేసింది కేసీఆరేనని అన్నారు. తల్లి లాంటి పార్టీని గుండెలమీద తన్నాడని మంత్రి హరీశ్​రావు విమర్శించారు.

ఇదీ చూడండి: Huzurabad By Poll: హుజూరాబాద్​లో పదునెక్కుతున్న వాక్​ బాణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.