హుజూరాబాద్‌లో అభ్యర్థి ఎవరైనా సీఎం కేసీఆర్‌కు బానిసే అని భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార తెరాస రూ.కోట్లు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. హుజూరాబాద్‌లో కుల సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈటల మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. బానిస అభ్యర్థులు కావాలా? ప్రజల హక్కులు, ఆత్మ గౌరవం కోసం పోరాడే వ్యక్తి కావాలా? అనేది హుజూరాబాద్ ప్రజలే నిర్ణయిస్తారన్నారు. హుజూరాబాద్ ఎన్నిక ఉపఎన్నిక మాత్రమే కాదని.. ఈ ఎన్నికతో ఇంకెంతమంది రాజేందర్‌లు ప్రశ్నిస్తారోనని సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలందరి మీద కేసీఆర్ నిఘా ఉందన్నారు. 2014కు ముందు వరకు సీఎం కేసీఆర్, హరీశ్‌రావు ఆస్తులెంతో ప్రజలందరికీ తెలుసునని ఈటల వెల్లడించారు.
హుజూరాబాద్‌లో ఇప్పటివరకు కేసీఆర్ రూ.192 కోట్లు ఖర్చు పెట్టారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ నియోజకవర్గంలో గత మూడు రోజుల నుంచి దసరా పండుగ నడుస్తోందని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో భాజపా నాయకుల పైనే కాకుండా తెరాస ఇంఛార్జిలపై కూడా నిఘా పెట్టించారని ఆరోపించారు.
హుజూరాబాద్‌లో కూడా ఆగవు
రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పదని నిరూపిస్తున్నారు హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలు. తెలంగాణలో రాజకీయ విలువలు లేవు.. కేవలం కేసీఆర్ అరాచకం మాత్రమే ఉంది. నా పద్దెనిమిది సంవత్సరాల చరిత్రలో సంస్కారహీనంగా మాట్లాడలేదు. తెలంగాణలో ఎమ్మెల్యేల అందరి మీద నిఘా ఉంది. రాజేందర్ అనే వ్యక్తి రాజీనామా చేసి కూడా సాధిస్తండు అంటున్నరు ప్రజలు. నేను అదృష్టవంతున్ని.. నా రాజీనామా వల్ల ఏడు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న పనులు అన్ని జరుగుతున్నాయి. దళితబంధు ఒక్క హుజూరాబాద్‌లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలని కోరుతున్నా. దుబ్బాకలో భాజపా వస్తే సంక్షేమ పథకాలు ఆగలేదు.. హుజూరాబాద్‌లో కూడా ఆగవు. హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలకు పార్టీలు ముఖ్యం కాదు ఈటల రాజేందర్ ముఖ్యం. బక్కపల్చని ఈటల చిన్నోడే అయితే ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చుపెడుతున్నవు
-ఈటల రాజేందర్, భాజపా నేత
ఇవీ చదవండి: