ETV Bharat / state

వాడవాడన బతుకమ్మ సంబురాలు... పూల వనాలుగా మారిన తటాకాలు - తెలంగాణ బతుకమ్మ వేడుకలు

పల్లెలు, పట్టణాలు పూలవనాల్లా మారాయి. తీరొక్కపూలతో బతుకమ్మలు పేర్చిన ఆడపడుచులు... పాటలు పాడుతూ పాదం కలిపారు. ఎంగిలిపూలతో మొదలైన వేడుకలు... సద్దుల బతుకమ్మతో ముగించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసి, వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కరోనా మహమ్మారి పోవాలని గౌరమ్మను వేడుకున్నారు.

వాడ వాడన బతుకమ్మ సంబురాలు... పూల వనాలుగా మారిన తటాకాలు

author img

By

Published : Oct 25, 2020, 5:29 AM IST

Updated : Oct 25, 2020, 7:34 AM IST

వాడ వాడన బతుకమ్మ సంబురాలు... పూల వనాలుగా మారిన తటాకాలు

రాష్ట్రవ్యాప్తంగా ఆడపడుచులంతా... ఆటపాటలు, ఆనందోత్సహాలతో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. వాడవాడనా ఓ చోట చేరిన మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ సందడిగా గడిపారు.

పూల వనంలా మారిన తటాకాలు...

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ పండుగైన సద్దుల బతుకమ్మ వేడుకలు కరీంనగర్‌లో ఘనంగా జరిగాయి. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చిన మహిళలు... గౌరమ్మ పాటలు పాడుతూ సంబురాలు జరుపుకున్నారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు బతుకమ్మను ఎత్తుకొని నిమజ్జనానికి తరలించారు. హుజూరాబాద్‌, జమ్మికుంట, కమలాపూర్‌ మండలాల్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి ఈటల పాల్గొన్నారు.

పెద్దపెల్లి జిల్లా రామగుండంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందించారు. పెద్దపల్లి జిల్లా మంథని, కరీంనగర్ జిల్లా చొప్పదండి, జగిత్యాలలో వాడవాడలా మహిళలు బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు.

పాదం కలిపిన ప్రజా ప్రతినిధులు...

వరంగల్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో అందంగా తయారు చేసిన బతుకమ్మలతో... మహిళలు హన్మకొండ పద్మాక్షి గుట్ట బాటపట్టారు. అక్కడే ఆడిపాడి సందడి చేశారు. మహిళలు ఒకరికొకరు వాయినాలు, ప్రసాదాలు ఇచ్చి పుచ్చుకున్నారు. బతుకమ్మల నిమజ్జనంతో గుండం పూలయేరులా మారింది. నీటిపై బతుకమ్మలు తేలుతూ చూపరులను ఆకట్టుకున్నాయి. పర్వతగిరి, సంగెo, పెర్కవీడు, రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లో మంత్రి ఎర్రబెల్లి పర్యటించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ ఆడాలని మహిళలకు సూచించారు. అనంతరం మంత్రి మహిళలతో కలిసి కాలు కదిపారు. పర్వతగిరిలోని మంత్రి ఎర్రబెల్లి నివాసంలో ఆయన కుటుంబసభ్యులు... ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ కుటుంబసభ్యులు కలిసి బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మను ప్రధాన కూడళ్ల వద్ద ఉంచి మహిళలు ఆటలాడారు. బతుకమ్మ సంస్కృతిని విదేశాల్లో చాటుతూ తెలంగాణ కీర్తిని పెంచుతున్నఎన్​ఆర్​ఐలను మంత్రి హరీశ్‌రావు అభినందించారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు మహిళలకు బహుమతులు అందించారు. నల్గొండలో మహిళలు, యువతులు ఆటపాటలతో సందడి చేశారు. సూర్యాపేట చౌదరి చెరువు సమీపంలోని ఓ ముస్లిం యువకుడు అతిపెద్ద బతుకమ్మ తయారు చేశాడు. 15 ఏళ్లుగా బతుకమ్మలను పేర్చుతూ సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తున్నాడు.

ఇదీ చూడండి: ఆన్​లైన్​​ ద్వారా సింగపూర్​లో బతుకమ్మ సంబురాలు

Last Updated : Oct 25, 2020, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.