కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతి ముందు ఓ యాచకుడు సోమవారం ఉదయం మృతి చెందాడు. కరోనా భయంతో అతని మృతదేహాన్ని సాయంత్రం వరకూ ఎవరూ పట్టించుకోలేదు. 24 గంటల పాటు ఆ రహదారిలో వాహనాల అలికిడి ఉన్నప్పటికీ శవాన్ని అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేయలేదు.
ఆయన చాలా కాలంగా అక్కడే ఉంటున్నారని స్థానిక దుకాణాదారులు తెలిపారు. యాచకుడు మృతిచెందిన విషయాన్ని పక్కనే ఉన్న నగరపాలక సిబ్బందికి, ఒకటో పట్టణ పోలీసులకు తెలిపినప్పటికీ... వారు పట్టనట్లుగా వ్యవహరించారని అన్నారు. సాయంత్రం వరకూ మృతదేహం అక్కడే ఉండడంతో చివరికి నగరపాలక సిబ్బంది మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల్లో మిస్ ఇండియా ఫైనలిస్ట్ ఓటమి