కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టు బూత్కూర్లో ప్రమాదవశాత్తు ఓ వ్యవసాయ బావిలో ఎలుగుబంటి పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు... గ్రామస్థుల సహకారంతో తాళ్లతో బంధించి ఎలుగుబంటిని బయటికి తీసి గుట్టల్లోకి వదిలిపెట్టారు. జనవాసాల్లోకి తరచూ ఎలుగుబంట్లు వస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : నామినేటెడ్ పదవుల భర్తీపై కేసీఆర్ నజర్!