కరీంనగర్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెతో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు ఆగిపోయాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకుల ముందు ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 20శాతం వేతనాల పెంపు, ఐదు రోజుల పనిదినాలు, ఎన్పీఎస్ తొలగింపు వంటి 11 డిమాండ్లపై కేంద్రంతో జరిగిన చర్చలు విఫలమయినందునే సమ్మెకు దిగినట్లు బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే మార్చి 11,12,13 తేదీల్లో సమ్మె ఉంటుందని యుఎఫ్బీయూ యూనియన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. స్తంభించిన లావాదేవీలు - bank employees protest at karimnagar
కరీంనగర్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ధర్నా చేపట్టారు.
కరీంనగర్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెతో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు ఆగిపోయాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకుల ముందు ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 20శాతం వేతనాల పెంపు, ఐదు రోజుల పనిదినాలు, ఎన్పీఎస్ తొలగింపు వంటి 11 డిమాండ్లపై కేంద్రంతో జరిగిన చర్చలు విఫలమయినందునే సమ్మెకు దిగినట్లు బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే మార్చి 11,12,13 తేదీల్లో సమ్మె ఉంటుందని యుఎఫ్బీయూ యూనియన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
ఇదీ చూడండి: ఇకపై హైదరాబాద్లోనే కరోనా టెస్టింగ్