ETV Bharat / state

'కేంద్రం వరి బోనస్​ అడ్డుకుంటోందని తెరాస దుష్ప్రచారం' - కరీంనగర్​ జిల్లా వార్తలు

స్పష్టత లేకుండానే వ్యవసాయ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కొత్త చట్టం ప్రకారం పంట ధరపై ముందే ఒప్పందం కుదుర్చుకోవచ్చని చెప్పారు.

bandi sanjay react on telangana government comments in karimnagar district
స్పష్టత లేకుండా చట్టాలను వ్యతిరేకిస్తున్నారు: బండి సంజయ్‌
author img

By

Published : Dec 9, 2020, 4:30 PM IST

Updated : Dec 9, 2020, 5:28 PM IST

వరికి కేంద్రం బోనస్ ఇవ్వొద్దన్నట్లు రాష్ట్రం దుష్ప్రచారం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. స్పష్టత లేకుండానే కేంద్ర చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని అన్నారు. కొత్త చట్టం ప్రకారం పంట ధరపై ముందే ఒప్పందం కుదుర్చుకోవచ్చని చెప్పారు. ఎంత దిగుబడి వచ్చినప్పటికీ ఒప్పందం ప్రకారం మొత్తం కొంటారని పేర్కొన్నారు.

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కృత్రిమ ఉద్యమం చేశారని మండిపడ్డారు. నిన్న జరిగిన బంద్‌లో ఎక్కడా రైతులు పాల్గొనలేదని చెప్పారు. ఎన్నికలప్పుడు మాత్రమే రైతుబంధు గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. రుణమాఫీ ఎందుకు చేయలేదో సీఎం చెప్పాలని డిమాండ్​ చేశారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల నుంచి దృష్టి మళ్లించేందుకు కొత్త దుకాణం తెరిచారని విమర్శించారు.

స్పష్టత లేకుండా చట్టాలను వ్యతిరేకిస్తున్నారు: బండి సంజయ్‌

ఇదీ చదవండి: ఉల్లి నిల్వలపై నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

Last Updated : Dec 9, 2020, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.