భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సర్వేల పేరుతో కాలయాపన చేయవద్దని కోరారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వేల రూపాయల పెట్టుబడి నీటిపాలైందని వాపోయారు. రైతాంగాన్ని ఆదుకోకపోతే రానున్న రోజుల్లో వ్యవసాయం చేయలేని పరిస్థితులు నెలకొంటాయన్నారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో పర్యటించిన సంజయ్.. ఇటీవల కురిసిన వర్షాలకు నేలరాలిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
- ఇదీ చదవండి : హైదరాబాద్ వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష