కరీంనగర్లో హరి హర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 దంపతులతో గురునాథ వ్రతం చేయించారు. లోకకల్యాణార్థం చేపట్టిన వ్రతం ఫలించి రాష్ట్రంలోని ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని పురాణం మహేశ్వర శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఇవీ చూడండి : ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న కాంగ్రెస్